Published on Apr 9, 2025
Government Jobs
డీసీహెచ్‌ఎస్‌లో పోస్టులు
డీసీహెచ్‌ఎస్‌లో పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ఏలూరు జిల్లాలోని డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఆసుపత్రులకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఒప్పంద, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన  నియామకాలు ఉంటాయి.

మొత్తం పోస్టుల సంఖ్య: 31

వివరాలు:

ఒప్పంద పోస్టులు: 

1. బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌- 01

2. ఆడియోమెట్రిషియన్‌- 05

3. రేడియోగ్రాఫర్‌- 03

4. ల్యాబ్‌ టెక్నీషియన్‌- 01

అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు:

1. థియేటర్‌ అసిస్టెంట్‌- 04

2. ప్లంబర్‌- 02

3. ఆఫీస్‌ సబార్డినేట్‌- 01

4. జనరల్‌ డ్యూటీ/ అడెండెంట్స్‌- 11

5. పోస్ట్‌మార్టమ్‌ అసిస్టెంట్‌- 03

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, డీఎంఎల్‌టీ, బీఎస్సీ, ఎంఎల్‌టీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత కోర్సు సర్టిఫికేట్‌ ఉండాలి.

వయోపరిమితి: 2025 జనవరి 1వ తేదీ నాటికి 42 మించకూడదు.ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌కు రూ.54,060; ఆడియోమెట్రిషియన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌కు రూ.32,670; రేడియోగ్రాఫర్‌కు రూ.35,570; ఇతర పోస్టులకు రూ.15,000.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: దరఖాస్తు పూర్తి చేసి గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ క్యాంపస్‌, ఏలూరు డీసీహెచ్‌ఎస్‌ ఆఫీస్‌లో సమర్పించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 19.04.2025.

Website:https://westgodavari.ap.gov.in/notice_category/recruitment-en/