Published on Apr 8, 2025
Current Affairs
డిసౌజాతో ముర్ము భేటీ
డిసౌజాతో ముర్ము భేటీ

రెండ్రోజుల పర్యటన నిమిత్తం పోర్చుగల్‌ వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, ఏప్రిల్‌ 7న ఆ దేశ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజాతో లిస్బన్‌లో భేటీ అయ్యారు.

ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన ముఖ్యాంశాలన్నింటిపై ఇద్దరు నేతలు చర్చించినట్లు పోర్చుగల్‌ అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ వేదికలపై పరస్పరం సహకరించుకోవాలని భారత్, పోర్చుగల్‌ నిర్ణయించుకున్నాయి.