Published on Feb 6, 2025
Walkins
డీసీఐఎల్, విశాఖపట్నంలో ట్రైనీ పోస్టులు

విశాఖపట్నంలోని సీతమ్మధారలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 45

వివరాలు:

1. డ్రెడ్జ్ క్యాడెట్లు : 10

2. ట్రైనీ మెరైన్ ఇంజనీర్లు : 10

3. ఎన్‌సీవీ (ట్రైనీలు) : 15

4. టీఈఎల్‌ఓ (ట్రైనీ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్) : 10

అర్హత: పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌ (ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ మెరైన్/ డ్రెడ్జింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వేతనం: నెలకు డ్రెడ్జ్ క్యాడెట్లలకు రూ.15,000; ట్రైనీ మెరైన్ ఇంజనీర్లలకు రూ.25,000; ఎన్‌సీవీ ట్రైనీలకు రూ.10,000; టీఈఎల్‌ఓ (ట్రైనీ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్) లకు రూ.25,000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్య్వూ, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 13, 14-02-2025.

వేదిక: డీసీఐఎల్‌, డ్రెడ్జ్‌ హౌజ్‌, హెచ్‌బీ కాలనీ, సీతమ్మధార, విశాఖపట్నం.

Website:https://www.dredge-india.com/