Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 4, 2025
Government Jobs
డీసీఐఎల్‌, విశాఖపట్నంలో ఉద్యోగాలు
డీసీఐఎల్‌, విశాఖపట్నంలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (డీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 25

వివరాలు:

1. కన్సల్టెంట్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్‌: 06

2. ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడింగ్‌వర్క్‌: 01

3. హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయర్‌: 13

4. ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్ (ఆపరేషన్స్/ప్రాజెక్ట్స్): 2 

5. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టెంట్: 1 

6. లీగల్ కన్సల్టెంట్: 1 

7. రెసిడెంట్ మేనేజర్: 1 

8. అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ: 1 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత, మాస్టర్స్‌ (ఎఫ్‌జీ)/డ్రెడ్జ్‌ మాస్టర్స్‌ సర్టిఫికేట్స్‌తో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్‌కు రూ.25,000- రూ.40,000; ప్రాజెక్ట్ మేనేజర్ రూ.50,000- రూ.65,000; లీగల్ కన్సల్టెంట్/రెసిడెంట్ మేనేజర్/ఏసీఎస్‌కు రూ.40,000- రూ.రూ.70,000; ఐటీ  కన్సల్టెంట్/ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు రూ.1,00,000-రూ.1,25,000; ఇన్‌లాండ్ డ్రెడ్జింగ్ కన్సల్టెంట్‌కు రూ.1.5లక్షల- రూ.2.0 లక్షలు.

వయోపరిమితి: హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్‌కు, ప్రాజెక్ట్ మేనేజర్, లీగల్ కన్సల్టెంట్/రెసిడెంట్ మేనేజర్/ఏసీఎస్‌, ఐటీ కన్సల్టెంట్ పోస్టులకు 45ఏళ్లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు 50 ఏళ్లు మించకూడదు. ఇన్‌లాండ్ డ్రెడ్జింగ్ కన్సల్టెంట్‌కు 40- 60 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, విద్యార్హతలు, ఉద్యోగానుభవం, మెడికల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 23.12.2025

Website:https://www.dredge-india.com/