పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి డా.వైఎస్‌ఆర్‌హెచ్‌యూతో పాటు అనుబంధ ఉద్యాన కళాశాలల్లో డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. డిప్లొమా ఇన్ హార్టికల్చర్: 352 సీట్లు (ప్రభుత్వ- 220; అనుబంధ- 132)
2. డిప్లొమా ఇన్ హార్టికల్చరల్ (ల్యాండ్‌స్కేపింగ్ అండ్ నర్సరీ మేనేజ్‌మెంట్): 55 సీట్లు
ప్రోగ్రామ్ వ్యవధి: రెండేళ్లు (4 సెమిస్టర్లు)
బోధనా మాధ్యమం: ఇంగ్లిష్
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (31-08-2025 నాటికి): 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పదో తరగతి మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 19-06-2025.
Website:https://drysrhu.ap.gov.in/