Published on Nov 30, 2024
Admissions
డా.వైఎస్సార్‌ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్
డా.వైఎస్సార్‌ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్

పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి డా.వైఎస్‌ఆర్‌హెచ్‌యూ అనుబంధ ఉద్యాన కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

కళాశాలలు: కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ (వెంకటరామన్నగూడెం), కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ (అనంతరాజుపేట).

1. ఎంఎస్సీ (హార్టికల్చర్): రెండేళ్లు/ నాలుగు సెమిస్టర్లు

సీట్ల సంఖ్య: 65.

2. పీహెచ్‌డీ(హార్టికల్చర్): మూడేళ్లు/ ఆరు సెమిస్టర్లు

సీట్ల సంఖ్య: 27.

విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాప్స్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, ప్లాంట్‌ పాథాలజీ, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌- ఎంటమాలజీ.

అర్హత: పీజీ కోర్సులకు బీఎస్సీ (హార్టికల్చర్‌), బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌; పీహెచ్‌డీ కోర్సులకు ఎంఎస్సీ (హార్టికల్చర్‌), ఎంఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: జులై 1, 2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: పీజీ కోర్సులకు ఐకార్‌- ఏఐఈఈఏ (పీజీ)-2024 ర్యాంకు; పీహెచ్‌డీ కోర్సులకు ఐకార్‌- ఏఐసీఈ జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2024 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌కు రూ.1500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.750.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది రిజిస్ట్రార్‌, డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా చిరునామాకు పంపాలి.

ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-12-2024.

కౌన్సెలింగ్ తేదీలు: పీజీ కోర్సులకు 28-12-2024; పీహెచ్‌డీ కోర్సులకు 30-12-2024.

Website:https://drysrhu.ap.gov.in/