Published on Sep 24, 2024
Walkins
డా.రామ్‌ మనోహర్‌ లోహియా ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు
డా.రామ్‌ మనోహర్‌ లోహియా ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

లఖ్‌నవూలోని డా.రామ్‌ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ కింది ఫాకల్టీ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 225.

వివరాలు:

ప్రొఫెసర్- 25

అసోసియేట్‌ ప్రొఫెసర్- 64

అసిస్టెంట్‌ ప్రొఫెసర్- 136

విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమి, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, రేడియేషన్‌ ఆంకాలజీ, సైకాలజీ, సైకియాట్రి, రేడియో-డైగ్నోసిస్‌, సర్జికల్ ఆంకాలజీ, ఆప్తల్మాలజీ, యూరాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.2,20,000; ప్రొఫెసర్ జూనియర్‌ గ్రేడ్‌ (అడిషనల్ ప్రొఫెసర్)కు రూ.1,80,000; అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,60,000; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,20,000.

వయోపరిమితి: అసిస్టెంట్‌ ప్రొఫెసర్/అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏళ్లు; ప్రొఫెసర్ పోస్టుకు 65 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు చివరి తేదీ: 28-09-2024.

ఇంటర్వ్యూ తేదీ: 30-09-2024.

Website:https://drrmlims.ac.in/