అనేక డ్రోన్‌లను, హెలికాప్టర్‌లను, మిసైళ్లను ఏకకాలంలో మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన యుద్ధ నౌకను ఇరాన్ 2025, ఫిబ్రవరి 6న ప్రారంభించింది.
ఈ యుద్ధ నౌక సముద్రంలో సుదూర ప్రాంతాల వరకూ ప్రయాణించగలదు. ఇది అనేక స్క్వాడ్రన్ల డ్రోన్‌లతో పాటు హెలికాప్టర్లను, క్రూజ్ మిసైళ్లను తీసుకెళ్లగలదు.
డ్రోన్‌ల కోసం 180 మీటర్ల రన్‌వే కలిగివున్న ఈ నౌక 22 వేల నాటికల్ మైళ్ల వరకూ ఇంధనం తిరిగి నింపాల్సిన అవసరం లేకుండా సాగగలదు. ఇది సముద్రంలో స్వతంత్రంగా ఏడాది పాటు ప్రయాణించగలదు.