భారత ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ బృందం కదిలే మోటార్ బైక్‌లపై అతిపెద్ద మానవ పిరమిడ్ రూపంతో అరుదైన ఘనతను సాధించింది.
దిల్లీలోని కర్తవ్యపథ్‌లో 7 బైక్‌లపై 40 మంది నిలబడి 20.4 అడుగుల ఎత్తుతో హ్యూమన్ పిరమిడ్ ఆకారాన్ని కళ్లకు కట్టారు.
విజయ్‌చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 2 కిలోమీటర్ల మేర రైడ్ కొనసాగించారు.