భారత్ చేపట్టనున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం రూపొందించిన డ్రోగ్ పారాచూట్లపై పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. తిరుగుప్రయాణంలో క్రూ మాడ్యూల్ వేగాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన డిసలరేషన్ వ్యవస్థలో ఉపయోగించేందుకు వీటిని అభివృద్ధి చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది.
చండీగఢ్‌లో ఉన్న టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబ్‌లో ఉన్న రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ (ఆర్‌టీఆర్‌ఎస్) కేంద్రంలో ఈ పరీక్షలు జరిగాయి.