Published on Dec 21, 2024
Current Affairs
డబ్ల్యూహెచ్‌వో మలేరియా నివేదిక-2024
డబ్ల్యూహెచ్‌వో మలేరియా నివేదిక-2024

మలేరియా కేసులు, ఆ వ్యాధితో ముడిపడ్డ మరణాలను గణనీయంగా తగ్గించడంలో భారత్‌ గణనీయ పురోగతి సాధించిందని డబ్ల్యూహెచ్‌వో మలేరియా నివేదిక-2024 పేర్కొంది.

భారత్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లి మలేరియా కేసులు, మరణాలను గణనీయంగా తగ్గిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. 

ఈ వ్యాధి ఎక్కువగా కనిపించే రాష్ట్రాల్లో కేసులను బాగా తగ్గించగలగడంతో మలేరియా అధికంగా ఉండే ‘హై బర్డన్‌ టు హై ఇంపాక్ట్‌’ (హెచ్‌బీహెచ్‌1) గ్రూప్‌ నుంచి భారత్‌ ఈ ఏడాది బయటపడింది.