Published on Nov 22, 2025
Current Affairs
డబ్ల్యూహెచ్‌వో నివేదిక
డబ్ల్యూహెచ్‌వో నివేదిక
  • భారత్‌లో 2023 సంవత్సరంలో 15-49 ఏళ్ల వయసు గల మహిళల్లో ఐదో వంతు మంది సన్నిహిత భాగస్వామితో హింసకు గురవ్వగా, దాదాపు 30 శాతం మంది వారి జీవితకాలంలో ఈ సమస్య బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. నవంబరు 25న ‘మహిళలు, బాలికలపై హింస నిర్మూలన దినోత్సవం’ సందర్భంగా ప్రపంచ వ్యాప్త పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌వో నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం..
  • ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు, మొత్తంగా 840 మిలియన్ల (84 కోట్లు) మంది వారి జీవితకాలంలో లైంగిక హింస ఎదుర్కొన్నారు.