ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక వెల్లడించింది.
2021 నాటికి ఉన్న సమాచారం ప్రకారం... వీరిలో రెండొంతుల మంది ఆందోళన, ఒత్తిళ్లతో బాధపడుతున్నారని పేర్కొంది.
‘వరల్డ్ మెంటల్ హెల్త్ టుడే’ పేరుతో విడుదల చేసిన నివేదికలో డబ్ల్యూహెచ్‌వో పలు విషయాలను పొందుపరిచింది.
ఆ వివరాల ప్రకారం.. యువతలో ఎక్కువ మంది చనిపోవడానికి ఆత్మహత్యలే ప్రధాన కారణం.
ప్రతి 100 మందిలో ఒకరు ఇలానే మరణిస్తున్నారు.
అలా చనిపోవడానికి ముందు ప్రతి ఒక్కరు కనీసం 20 సార్లు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు.