ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి తమ దేశం వైదొలిగే ప్రక్రియ పూర్తయిందని అమెరికా ప్రభుత్వం 2026, జనవరి 23న ప్రకటించింది. కొవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలుచేయడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం తెలిపింది.
ఇకపై డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నుంచి వచ్చే అన్నిరకాల నిధులు నిలిపివేస్తున్నామని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని అన్ని కార్యాలయాల నుంచి యూఎస్ సిబ్బందిని వెనక్కి పిలిపించినట్లు వెల్లడించింది. ఇకనుంచి పరిమిత పరిధి మేరకు డబ్ల్యూహెచ్‌వోతో కలిసి పనిచేయనున్నట్లు యూఎస్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.