డబ్ల్యూహెచ్‌వో ఏటా విడుదల చేసే వ్యాధి గణాంకాల నమోదు, విశ్లేషణ, వ్యాఖ్యానాల సంకలనం (ఐసీడీ)- 11లో సంప్రదాయ వైద్యరీతులకు స్థానం కల్పించింది.
దీనికి సంబంధించి తాజా ఐసీడీ-11లో కొత్త మాడ్యూల్‌ను ప్రవేశపెట్టారు. దీంతో దేశీయ వైద్య రీతులైన ఆయుర్వేద, సిద్ధ, యునానీలకూ అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లైందని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
జాతీయ వైద్య సేవా వ్యూహాల్లో, వైద్య విధానాల్లో దేశీయ వైద్యానికి స్థానం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయుష్ శాఖ పేర్కొంది.