Published on Sep 30, 2024
Current Affairs
డబ్ల్యూహెచ్‌వో గణాంకాలు
డబ్ల్యూహెచ్‌వో గణాంకాలు

♦ పురుషులకు ప్రాణాంతకమైన ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు భారత్‌లో ఎక్కువవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.

♦  సెప్టెంబరును ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ అవగాహనా నెలగా పాటిస్తున్నారు. 

♦  డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం, 50 ఏళ్ల లోపు వయసున్నవారు ఈ క్యాన్సర్‌ బారిన పడటమూ ఎక్కువవుతోంది. 

♦ 2022లో భారత్‌లో 14 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవగా, అందులో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు 37,948. ఇది మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో 3 శాతం.