Published on Jan 24, 2025
Current Affairs
డబ్ల్యూసీసీలోకి జై షా
డబ్ల్యూసీసీలోకి జై షా

కొత్తగా ఏర్పాటైన వరల్డ్‌ క్రికెట్‌ కనెక్ట్స్‌ (డబ్ల్యూసీసీ) సలహా మండలిలో ఐసీసీ ఛైర్మన్‌ జై షాకు స్థానం కల్పించారు.

క్రికెట్లో అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ఈ స్వతంత్ర బోర్డును ఏర్పాటు చేసింది.

2025 జూన్‌ 7, 8 తేదీల్లో లార్డ్స్‌లో డబ్ల్యూసీసీ సమావేశం జరగనుంది. ప్రస్తుత కెప్టెన్‌లు, మాజీ క్రికెటర్లు, ప్రసార సంస్థల ప్రతినిధులు సహా పలువురికి సలహా మండలిలో చోటిచ్చారు.

భారత్‌ నుంచి మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ, ఐసీసీ సీసీఓ అనురాగ్‌ దహియా, జియో స్టార్‌ సీఈఓ సంజోగ్‌ గుప్తాలకు స్థానం లభించింది.