- మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. 2026, ఫిబ్రవరి 5న వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ జట్టు దిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది.
- దిల్లీ క్యాపిటల్స్ మొత్తం 20 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేయగా, ఆర్సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 రన్స్ చేసింది. డబ్ల్యూపీఎల్‌లో 204 పరుగులు అతిపెద్ద ఛేదన. గత రికార్డు కూడా ఆర్సీబీ (గుజరాత్‌పై 202)దే. 2024లోనూ ఆర్సీబీ డబ్ల్యూపీఎల్ విజేతగా నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగుసార్లు (2023, 2024, 2025, 2026) ఫైనల్‌లో ఓడింది.