Published on Nov 11, 2024
Current Affairs
డబ్ల్యూటీఏ విజేత గాఫ్‌
డబ్ల్యూటీఏ విజేత గాఫ్‌

అమెరికా టెన్నిస్‌ స్టార్‌ కొకో గాఫ్‌ కెరీర్‌లో తొలిసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది. 2024, నవంబరు 10న రియాద్‌లో జరిగిన ఫైనల్లో ఆమె 3-6, 6-4, 7-6 (7-2)తో ఒలింపిక్‌ ఛాంపియన్‌ జెంగ్‌ కిన్వెన్‌ (చైనా)పై విజయం సాధించింది.  

మరోవైపు గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా), ఎరిన్‌ రౌట్లిఫ్‌ (న్యూజిలాండ్‌) జోడీ డబ్ల్యూటీఏ డబుల్స్‌ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఫైనల్లో ఈ ద్వయం 7-5, 6-3తో సైనికోవ్‌ (చెక్‌), టౌన్సెండ్‌ (అమెరికా) జంటను ఓడించింది.