Published on Dec 17, 2025
Current Affairs
డబ్ల్యూటీఏ ఉత్తమ ప్లేయర్‌గా సబలెంకా
డబ్ల్యూటీఏ ఉత్తమ ప్లేయర్‌గా సబలెంకా

డబ్ల్యూటీఏ ఈ ఏడాది (2025) ఉత్తమ ప్లేయర్‌ అవార్డును బెలారస్‌ స్టార్‌ అర్యానా సబలెంకా గెలుచుకుంది. ఈ పురస్కారాన్ని పొందడం ఈమెకు వరుసగా ఇది రెండోసారి. యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలవడం, ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరడం, సీజన్‌ను నంబర్‌వన్‌గా ముగించడంతో సబలెంకాకు అవార్డు దక్కింది. వరుసగా రెండు సీజన్లలో ఈ పురస్కారం అందుకున్న సెరెనా విలియమ్స్, ఇగా స్వైటెక్‌ సరసన సబలెంకా చోటు దక్కించుకుంది.