Published on Nov 16, 2024
Government Jobs
డబ్ల్యూఐఐలో సైంటిస్ట్-సి ఖాళీలు
డబ్ల్యూఐఐలో సైంటిస్ట్-సి ఖాళీలు

దేహ్రాదూన్‌లోని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (WII).. డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

పోస్టు పేరు- ఖాళీలు:

సైంటిస్ట్ - సి: 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (బయోలాజికల్/ అగ్రికల్చర్/ ఎన్విరాన్‌మెంటల్), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.67,700 - రూ.2,08,700.

దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ఎస్టీ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 06-01-2025.

రాతపరీక్ష తేదీ: 16-02-2025.

Website:https://wii.gov.in/