Published on Sep 17, 2025
Current Affairs
డబ్ల్యూఎంవో నివేదిక
డబ్ల్యూఎంవో నివేదిక

డబ్ల్యూఎంవో నివేదిక

సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్‌ పొర మళ్లీ బలపడుతోందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నివేదిక వెల్లడించింది.

1980ల్లో ఉన్నంత మందపు స్థాయికి ఈ శతాబ్దం మధ్యలోగా ఇది చేరుకుంటుందని తెలిపింది.

అంటార్కిటికాలో ఓజోన్‌కు పడిన రంధ్రం సైతం క్రమక్రమంగా తగ్గుతోందని చెప్పింది. 

2025, ఆగస్టు 16న అంతర్జాతీయ ఓజోన్‌ పొర దినోత్సవం, వియన్నా ఒప్పంద 40వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మేరకు డబ్ల్యూఎంవో ఓ నివేదిక వెలువరించింది.