వాతావరణ రికార్డులు నమోదుకావడం మొదలైనప్పటి నుంచి గడచిన పదేళ్లు (2015-2024) అత్యుష్ణ సంవత్సరాలుగా నిర్ధారణ అయ్యాయని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ (డబ్ల్యూఎంవో) 2025, మార్చి 19న ప్రకటించింది.
2023లో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు పాళ్లు ప్రతి 10 లక్షల పాళ్లకు 420గా నమోదైంది. ఇది 3.28 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ వాయువుకు సమానం. గడచిన 8 లక్షల సంవత్సరాలలో ఇదే అత్యధికమని డబ్ల్యూఎంవో హెచ్చరించింది.