అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈవో) నివేదికలో 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేసింది.
అంతేకాక భారత్ అత్యంత వేగవంతమైన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది.
ఇదే కాలంలో చైనా 4.8 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని పేర్కొంది.
అయితే, 2026లో భారత వృద్ధి రేటు 6.2 శాతానికి తగ్గవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది.