ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) దావోస్ ఆర్థిక సదస్సుకు ముందుగా ‘చీఫ్ ఎకనామిస్ట్స్ అవుట్‌లుక్’ నివేదికను 2026, జనవరి 17న విడుదల చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు 2026లో బలహీనంగా ఉంటాయని.. అయితే వృద్ధిపరంగా దక్షిణాసియా వెలుగు చుక్కలా మారుతుందని, ఇందులో భారత్ కీలకపాత్ర వహిస్తుందని నివేదిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ, ప్రైవేటు కంపెనీల్లోని ముఖ్య ఆర్థిక వేత్తల అభిప్రాయాలతో ఈ నివేదికను రూపొందించారు.