Published on Oct 17, 2024
Admissions
డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో యూజీ, పీజీ ప్రోగ్రామ్
డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో యూజీ, పీజీ ప్రోగ్రామ్

హైదరాబాద్‌లోని డా.బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్యా విధానంలో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

యూజీ ప్రోగ్రామ్: బీఏ, బీకాం, బీఎస్సీ 

పీజీ ప్రోగ్రామ్:

1. ఎంఏ: జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్/ ఎకనామిక్స్/ హిస్టరీ/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ పొలిటికల్ సైన్స్/ సోషియాలజీ/ ఇంగ్లిష్/ తెలుగు/ హిందీ/ ఉర్దూ.

2. ఎంఎస్సీ: మ్యాథ్స్‌/ అప్లైడ్‌ మ్యాథ్స్‌/ సైకాలజీ/ బోటనీ/ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫిజిక్స్/ జువాలజీ.

3. ఎంకాం

4. ఎంఎల్‌ఐఎస్సీ 

5. బీఎల్‌ఐఎస్సీ

6. డిప్లొమా ప్రోగ్రామ్‌: సైకలాజికల్ కౌన్సెలింగ్/ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ ఆపరేషనల్ మేనేజ్‌మెంట్/ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్/ హ్యూమన్ రైట్స్/ కల్చర్ & హెరిటేజ్ టూరిజం/ ఉమెన్స్ స్టడీస్/ ఇంటర్నేషనల్ రిలేషన్స్.

8. సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌/ ఎన్‌జీవోస్‌ మేనేజ్‌మెంట్‌/ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌.

వ్యవధి: యూజీ ప్రోగ్రామ్‌నకు మూడేళ్లు, పీజీ ప్రోగ్రామ్‌కు రెండేళ్లు, ఎంఎల్‌ఐఎస్సీ/ బీఎల్‌ఐఎస్సీ/ డిప్లొమా ప్రోగ్రామ్‌నకు ఏడాది, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌కు ఆరు నెలలు.

అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 30-10-2024.

వివరాలకు: అధ్యయన కేంద్రం లేదా 7382929570/580, 040-23680222/333/444/555 లేదా టోల్‌ ఫ్రీ 18005990101 సంప్రదించవచ్చు.

Website:http://www.braouonline.in/