తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు, డా.బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ-మెడికల్ అకాడమీల్లో 2025-2026 విద్యా సంవత్సరానికిగాను అయిదో తరగతి, ఇంటర్మీడియట్(ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ‘బీఆర్‌ఏజీ సెట్-2025’ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు.
వివరాలు:
డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులం ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు బీఆర్‌ఏజీ ఎంట్రన్స్ టెస్ట్- 2025
అర్హత: ఐదో తరగతికి జిల్లాలోని ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యాసంవత్సరంలో మూడో తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధిత జిల్లాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.
ఐఐటీ నీట్ కోచింగ్ సెంటర్లలో ప్రవేశాలకు బీఆర్‌ఏజీ సెట్ (జూనియర్ ఇంటర్) పరీక్ష మెరిట్ జాబితాలో ర్యాంక్ పొందిన విద్యార్థులు ఐఐటీ మెడికల్ అకాడమీల పరీక్షకు 1:3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేయబడతారు.
వయసు: అయిదో తరగతి ప్రవేశాలకు విద్యార్థి వయస్సు ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 01.09.2012 నుంచి 31.08.2016 మధ్య, ఓసీ/ బీసీ/ బీసీ-సి విద్యార్థులు 01.09.2014 నుంచి 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి.
ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులు 31.08.2025 నాటికి 17 ఏళ్లు మించకూడదు.
ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు.
రిజర్వేషన్ల వివరాలు: ఎస్సీలకు 75%, బీసీ-సిలకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ప్రశ్నపత్రం: ఐదో తరగతి ప్రవేశాకలు సంబంధించి ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. గణితం- 15, ఇంగ్లిష్- 10, తెలుగు- 10, ఈవీఎస్- 15 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది.
ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. గణితం- 15, ఫిజికల్ సైన్స్- 15, బయాలజీ/ నేచురల్ సైన్స్- 15, సామాకజిక అధ్యయనాలు- 10, ఇంగ్లిష్- 15, లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్- 30 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.03.2025.
హాల్ టికెట్ డౌన్‌లోడ్: 01.04.2025.
ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్ష తేదీ: 06.04.2025.
ఐదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ: 20.04.2025.
ఐఐటీ మెడికల్ కోచింగ్ సెంటర్ల ప్రవేశ పరీక్ష తేదీ: 20.04.2025.
Website:https://apbragcet.apcfss.in/