డెఫ్‌లింపిక్స్‌లో హైదరాబాదీ షూటర్ ధనుష్ శ్రీకాంత్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణంతోపాటు మరో పసిడి పతకాన్ని నెగ్గాడు. 2025, నవంబరు 18న టోక్యోలో జరిగిన 10మీ ఎయిర్‌రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో ధనుష్, మహిత్ సంధు జంట బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.
ఇదే విభాగంలో ముర్తజా వానియా, కోమల్ మిలింద్ ద్వయం కాంస్యం సాధించింది. ఫైనల్లో ధనుశ్ జోడీ 17-7తో దక్షిణ కొరియాకు చెందిన జియాన్ డైన్, కిమ్ వూరిమ్ జంటను ఓడించింది.