స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ మోండో డుప్లాంటిస్ మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. తాజాగా 2025, మార్చి 1న క్లేర్‌మాంట్ ఫెరాండ్ (ఫ్రాన్స్)లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ టూర్ మీటింగ్‌లో 6.27 మీటర్లు ఎగిరి కొత్త రికార్డు నెలకొల్పాడు.
2024లో జరిగిన పోలెండ్ డైమండ్ లీగ్‌లో నెలకొల్పిన రికార్డు (6.26 మీటర్లు)ను అతను బద్దలు కొట్టాడు. ప్రపంచ రికార్డును బ్రేక్ చేయడం ఇతడికి ఇది పదకొండోసారి.
మరోవైపు ప్రపంచ అథ్లెటిక్స్‌లో టోర్నీలో పోల్‌వాల్ట్‌లో కరాలిస్ (గ్రీస్, 6.02 మీ), మార్షల్ (ఆస్ట్రేలియా, 5.91 మీ) రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.