డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)గా సీఆర్‌పీఎఫ్ మాజీ డైరెక్టర్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్ అనీశ్ దయాళ్ సింగ్ నియమితులయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదం, నక్సల్స్ సమస్య, జమ్మూకశ్మీర్ వ్యవహారాలు సహా దేశ ఆంతరంగిక భద్రతకు సంబంధించిన విషయాలను అనీశ్ పర్యవేక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. మణిపుర్ కేడర్‌కు చెందిన 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనీశ్ 2024, డిసెంబరులో పదవీ విరమణ చేశారు.