రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ (78) 2025, జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఈ బాధ్యతల్ని ఆయన స్వీకరించడం ఇది రెండోసారి.
వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు.
తమ కుటుంబ బైబిల్‌ను, 1861లో అమెరికా అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ ప్రమాణం చేసినప్పటి బైబిల్‌ను చేతపట్టుకుని ఆయన దీన్ని పూర్తిచేశారు.
తెలుగు మూలాలున్న ఉషను వివాహం చేసుకున్న జె.డి.వాన్స్ ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవానా ఆయనచేత ప్రమాణం చేయించారు.