ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అర్బన్ క్లినిక్‌లు/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి జిల్లా వైద్యారోగ్య శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40.
వివరాలు:
1. ల్యాబ్ టెక్నీషియన్: 03 పోస్టులు
2. ఫార్మసిస్ట్: 11 పోస్టులు
3. డేటా ఎంట్రీ ఆపరేటర్: 11 పోస్టులు
4. శానిటరీ అటెండెంట్: 15 పోస్టులు
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, పీజీడీసీఏ, డీఫార్మసీ/ బీఫార్మసీ/ ఎంఫార్మసీ, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ) ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 01.09.2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్-సర్వీస్‌మ్యాన్ అభ్యర్థులకు రూ.100.
ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, గుంటూరు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 30-10-2024.
Website:https://guntur.ap.gov.in/