లంగాణలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్)’ పేరిట రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉచిత డిజిటల్ వేదికను ప్రారంభించింది.
ఇది పరిశ్రమలు, సంస్థలు... నిరుద్యోగుల మధ్య ఒక వారధిగా పనిచేస్తోంది.
నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగం పొందడానికి ఊతమిస్తుంది.
ఎలా పని చేస్తుందంటే...
ఈ పోర్టల్‌లో వివిధ రకాల శిక్షణలు ఇచ్చే సంస్థలను, వాటి ఉద్యోగ నోటిఫికేషన్లను, సాధారణ సందేహాలు, వాటికి సమాధానాలను పొందుపర్చారు.
మొత్తం 153 రకాల విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలను గుర్తించారు.
ఉదాహరణకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సేల్స్ మేనేజర్లు, టెక్నీషియన్లు, లెక్చరర్లు, వార్డెన్లు, సూపర్‌వైజర్లు తదితరాలు. అభ్యర్థి ఎవరైనా... తన భవిష్యత్తుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా పొందొచ్చు.