పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) నూతన చీఫ్‌గా వీర్ విక్రమ్ యాదవ్ 2026, మార్చి 31న నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ ఫయాజ్ అహ్మద్ కిద్వాయ్‌ను సిబ్బంది శిక్షణా శాఖకు అదనపు కార్యదర్శిగా బదిలీచేశారు. ఫయాజ్ స్థానంలో ఒడిశా క్యాడర్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విక్రమ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.