Published on Apr 22, 2025
Current Affairs
‘డెజర్ట్‌ ఫ్లాగ్‌-10’
‘డెజర్ట్‌ ఫ్లాగ్‌-10’

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో 2025, ఏప్రిల్‌ 21న ‘డెజర్ట్‌ ఫ్లాగ్‌-10’ వైమానిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. వీటిలో మన దేశం నుంచి మిగ్‌-29, జాగ్వార్‌ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఖతార్, సౌదీ అరేబియా, ద.కొరియా, టర్కీ దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. మే 8 వరకు ఇవి జరగనున్నాయి.