డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితం, సులభతరం చేయడంతో పాటు, ప్రమాణీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సిద్ధమయ్యింది. ఇందుకోసం ‘డిజిటల్ బ్యాంకింగ్ ఛానల్స్ ఆథరైజేషన్ డైరెక్షన్స్-2025’ పేరుతో కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. 2026 జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సహా, అన్ని వాణిజ్య బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.