కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ స్థాపక డైరెక్టర్, ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు డాక్టర్ రఘురామ్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్‌లోని గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ నుంచి ప్రతిష్ఠాత్మక గౌరవ ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు. దక్షిణాసియాలో ఈ గౌరవం పొందిన పిన్న వయసు సర్జన్‌గా డాక్టర్ రఘురామ్ రికార్డు నెలకొల్పారు.