డాక్టర్ రాకేశ్ కలపాల.. ‘ఫెలోషిప్ ఆఫ్ ది యూరోపియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ(ఎఫ్‌ఈఎస్‌జీఈ)’ గౌరవాన్ని పొందారు. యూరోపియన్ సొసైటీ అందించే ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికైన రెండో భారతీయుడిగా అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో సెంటర్ ఫర్ ఒబిసిటీ, మెటబాలిక్ థెరపీ విభాగం సీనియర్ కన్సల్టెంట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఎండోస్కోపీ డైరెక్టర్‌గా ఉన్నారు.