బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్‌లో స్థిరపడిన ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన డాక్టర్ అనురాధ ఉప్పలూరికి ప్రతిష్ఠాత్మక బ్రిటిష్ సిటిజన్ అవార్డు లభించింది. వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు.
ప్రతి సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించే పీపుల్స్ ఆనర్స్ అవార్డుల్లో భాగంగా సమాజాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు దీన్ని ప్రదానం చేస్తారు.
ఆటిజం గురించి అవగాహన పెంపొందించడం, ఆ రంగంలో పనిచేసే సంస్థలకు నిధులు సేకరించడం తరహా సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు అనురాధకు ఈ గౌరవం దక్కింది.
ఇప్పటి వరకు ఆమె రూ.30 వేల పౌండ్లను సేకరించి, అనేక సంస్థలకు అందించారు.