Published on Apr 9, 2025
Apprenticeship
డీఆర్‌డీవో-ఏఆర్‌డీఈలో అప్రెంటిస్‌ పోస్టులు
డీఆర్‌డీవో-ఏఆర్‌డీఈలో అప్రెంటిస్‌ పోస్టులు

పునెలోని డీఆర్‌డీవో- ఆర్నమెట్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 70

పోస్టు పేరు-ఖాళీలు:

విభాగాలు: ఎలక్ట్రిషీయన్‌, ఫిట్టర్‌, మెషనిస్ట్‌, ఎంఎంటీఎం, సీవోపీఏ, ఎంఎంవీ, ఆర్‌ అండ్‌ ఏసీ, ఫోటోగ్రాఫర్‌, టర్నర్‌, వెల్డర్‌, కార్పెంటర్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ మెకానికల్

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 2025 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 - 30 ఏళ్ల లోపు ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.13,000.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 20

Website:https://drdo.gov.in/drdo/career/arde-pune-invites-online-application-eligible-iti-holders-apprenticeship-training-under