బెంగళూరులోని డీఆర్‌డీవో- ఎలక్ట్రానిక్స్ అండ్ రాడర్ డెవెలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎల్‌ఆర్‌డీఈ) 2025-26 సంవత్సరానికి గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 118
వివరాలు:
ట్రేడ్ అప్రెంటిస్- 30
డిప్లొమా అప్రెంటిస్- 30
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 58
వ్యవధి: ఏడాది.
ట్రేడులు/విభాగాలు: కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్/ డేటా ఎంట్రీ, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, మెషినిస్ట్/ సీఎన్‌సీ మెషినింగ్ టెక్, మెకానిక్ మోటర్ వెహికిల్, టర్నర్, వెల్డర్, ఫోటో గ్రాఫర్, మెకానికల్ ఇంజినీరింగ్, బీకాం, బీఎస్సీ, బీసీఏ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ తదితరాలు.
అర్హతలు: సంబంధిత విభాగం, ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.7,000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8,000; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9,000.
కనిష్ఠ వయోపరిమితి: 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, విద్యార్హత మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.05.2025.
Website:https://drdo.gov.in/drdo/careers