Published on Apr 30, 2025
Apprenticeship
డీఆర్‌డీవోలో అప్రెంటిస్‌ పోస్టులు
డీఆర్‌డీవోలో అప్రెంటిస్‌ పోస్టులు

దిల్లీలోని డీఆర్‌డీవో-డిఫెన్స్‌ సైంటిఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్ డాక్యుమెంటేషన్‌ సెంటర్‌ (డీఆర్‌డీఓ - డీఈఎస్‌ఐడీఓసీ) 2025-26 సంత్సరానికి గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 30

వివరాలు:

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 20

2. డిప్లొమా అప్రెంటిస్‌(కంప్యూటర్‌ సైన్స్‌): 07

3. డిప్లొమా అప్రెంటిస్‌(వీడియో అండ్ ఫోటోగ్రఫి): 02

4. డిప్లొమా అప్రెంటిస్‌(ప్రింటింగ్ టెక్నాలజీ): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: డైరెక్టర్, డీఈఎస్‌ఐడీఓసీ, మెట్‌కాల్ఫ్ హౌస్, ఢిల్లీ-110 054.

దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 20.

Website:https://drdo.gov.in/drdo/careers