Published on Sep 26, 2024
Apprenticeship
డీఆర్‌డీవోలో అప్రెంటిస్‌ ఖాళీలు
డీఆర్‌డీవోలో అప్రెంటిస్‌ ఖాళీలు

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)కు చెందిన రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) 2024-25 ఏడాదికి అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 200

వివ‌రాలు:

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 40

2. టెక్నీషియన్ అప్రెంటిస్‌: 40

3. ట్రేడ్ అప్రెంటిస్: 120

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌,  కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్, కెమికల్, కమర్షియల్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, వెల్డర్‌ తదితరాలు. 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.08.2024 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

అప్రెంటిస్‌షిప్ కాలం: ఒక సంవత్సరం.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ ధ‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ: 12.10.2024

Website:https://www.drdo.gov.in/drdo/