Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 12, 2026
Internship
డీఆర్‌డీఓ హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు
డీఆర్‌డీఓ హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

పుణెలోని రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్‌డీవో- హైఎనర్జీ మెటీరియల్స్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌) ఆరు నెలల కాలానికి ఏరోస్పేస్‌, కెమికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ తదితర ఇంజినీరింగ్‌ విభాగంలో పేయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

పేయిడ్‌ ఇంటర్స్‌షిప్‌: 40 ఖాళీలు

విభాగాలు: ఏరోస్పేస్‌, కెమికల్‌, మెకానికల్‌, కెమికల్‌, ఫిజిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌

ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 6 నెలలు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌, ఎంటెక్‌/ఎంఎస్సీ (చివరి ఏడాది) చదువుతున్న వారు.

స్టైపెండ్‌: నెలకు రూ.5,000.

ఎంపిక విధానం: విద్యార్హతల ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ది డైరెక్టర్‌ హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌, సుతర్వాడి, పుణె చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 20.01.2026.

ఇంటర్న్‌షిప్ శిక్షణ ప్రారంభ తేదీ: 01.02.2026.

Website:https://drdo.gov.in/drdo/