బెంగళూరులోని డీఆర్‌డీవో- కాంబాట్ ఏయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ డెవెలప్‌మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ సెంటర్ (సీఏఎస్‌డీఐసీ) ఆరు నెలల కాలానికి బీఈ/ బీటెక్ అండ్ ఎంఎస్సీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ పోస్టుల్లో అవకాశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
బీఈ/బీటెక్, ఎంఎస్సీ: 30 ఖాళీలు
విభాగాలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్.
ఇంటర్న్‌షిప్ వ్యవధి: 6 నెలలు.
అర్హత: సంబంధిత విభాగాల్లో మొదటి ఏడాది గ్రాడ్యుయేషన్ (ఇంజినీరింగ్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ (సైన్స్) ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.5,000.
వయోపరిమితి: 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 10.11.2025.
Website: https://drdo.gov.in/drdo/careers