భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) - సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సీఈపీటీఏఎం) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ నియామకాలను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 764
వివరాలు:
1. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి: 561 పోస్టులు
2. టెక్నీషియన్-ఏ: 203 పోస్టులు
విభాగాలు: ఆటోమొబైల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, జియోలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, లైబ్రరీ సైన్స్, సైకాలజీ, బుక్ బైండర్, కార్పెంటర్, సీఓపీఏ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, టర్నర్ తదితరాలు.
అర్హత: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎస్సీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత, టెక్నీషియన్‌కు టెన్త్‌తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
జీతం: నెలకు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.35,400- రూ.1,12,400; టెక్నీషియన్-ఏకు రూ.19,900- రూ.63,200.
వయోపరిమితి: 01.01.2026 నాటికి 18-28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: టైర్-I, టైర్-II కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, ట్రేడ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
పరీక్ష ఫీజు: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ యూఆర్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌కు రూ.750; టెక్నీషియన్ యూఆర్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.500. (టైర్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఫీజు రూ.500 రీఫండ్ అవుతుంది).
టైర్-I సీబీటీకు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 01.01.2026.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03-01-2026.
దరఖాస్తు కరెక్షన్ విండో: 04-01-2026 నుంచి 06-01-2026.
Tier-I పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.