విశాఖపట్నంలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో - 07
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సంబంధిత విభాగంలో కనీసం 70 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు నెట్/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.37,000.
ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 26.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
వేదిక: ఎన్‌ఎస్టీఎల్, విజ్ఞాన్ నగర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.