Published on Feb 22, 2025
Walkins
డీఆర్‌డీఓ మైసూర్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు
డీఆర్‌డీఓ మైసూర్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

మైసూరులోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బైయో-డిఫెన్స్‌ టెక్నాలజీస్‌ (డీఆర్‌డీఓ-డీఐబీటీ) వివిధ విభాగాల్లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 18

వివరాలు:

విభాగాలు: మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బైయోకెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్‌, ఫుడ్ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌, పాలిమర్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, నెట్‌, గేట్‌, బీఈ, బీటెక్‌, ఎంటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి.  

వయోపరిమితి: 20.03.2025 తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. 

జీతం: నెలకు రూ.37,000.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

వేదిక: డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బైయో-డిఫెన్స్‌ టెక్నాలజీస్‌ (DRDO-DIBT) మైసూరు-570011 

ఇంటర్వ్యూ తేదీ: 20 మార్చి 2025

Website:https://www.drdo.gov.in/drdo/careers