Published on Dec 1, 2025
Internship
డీఆర్‌డీఓ-డీఐపీఆర్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు
డీఆర్‌డీఓ-డీఐపీఆర్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

దిల్లీలోని డీఆర్‌డీఓ- డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకలాజికల్‌  రిసెర్చ్‌ (డీఐపీఆర్‌) రెండు సంవత్సరాల కాలానికి జేఆర్‌ఎఫ్‌, ఆర్‌ఏ పేయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 10

వివరాలు:

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 08 ఖాళీలు

 రిసెర్చ్‌ అసోసియేట్‌: 02 ఖాళీలు

ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌ అర్హత ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.37,000. రిసెర్చ్‌ అసోసియేట్‌కు రూ.67,000.

వయోపరిమితి: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు 28 ఏళ్లు; రిసెర్చ్‌ అసోసియేట్‌కుకు 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టర్, డీఐపీఆర్‌, లఖ్‌నవూ రోడ్‌, దిల్లీ చిరునామాకు పంపించాలి..

దరఖాస్తు చివరి తేదీ: 19.12.2025.

Website:https://drdo.gov.in/drdo/en