Published on Sep 3, 2025
Apprenticeship
డీఆర్డీఓ - చెస్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
డీఆర్డీఓ - చెస్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓకు చెందిన సెంటర్‌ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్‌ అండ్‌ సైన్సెస్‌ (చెస్‌) గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ (ఇంజినీర్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 25

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ (ఇంజినీర్స్‌) అప్రెంటిస్‌: 10 

టెక్నికల్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 15

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు గ్రాడుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.9000, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు రూ. 8000.

ఎంపిక విధానం: అభ్యర్థుల మార్కుల శాతం, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

వ్యవధి: 12 నెలలు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టర్‌ సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌ డీఆర్‌డీఓ, ఆర్‌సీఎల్‌ క్యాంపస్‌, హైదరాబాద్‌.

దరఖాస్తు చివరి తేదీ: 22-09-2025.

website:https://drdo.gov.in/drdo/